ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. రమణయ్య హత్య తరవాత నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో ఓ బృందం చెన్నై వెళ్లింది. అక్కడ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. విశాఖ సీపీ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం…
భూ వివాదాలే ఎమ్మార్వో రమణయ్య హత్యకు (mro murder case ) దారితీశాయని విశాఖ సీపీ రవిశంకర్ విలేకరులకు వెల్లడించారు. కన్వేయన్స్ డీడ్‌ను ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. చాలా కాలం నుంచి వాయిదా పడుతోందని ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. ఎమ్మార్వో రమణయ్య హత్యకు భూ గొడవలు ఒక్కటే కాదని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. పోలీసులు చెబుతున్నదానికి, నిందితుడు చెబుతున్నదానికి పొంతన కుదరడం లేదు. మరిన్ని వివరాలు సేకరించేందుకు డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో రమణయ్య హత్యలో నిందితుడు సుబ్రహ్మణ్యంపై రెండు చీటింగ్ కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. పూర్తి విచారణ తరవాత రమణయ్య హత్యపై మరిన్ని వివరాలు అందిస్తామని రవిశంకర్ ప్రకటించారు.
విశాఖలో భూముల ధరలు పెరిగిపోవడంతో రెవెన్యూ అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే విషయాన్ని సీపీ గుర్తుచేశారు. కలెక్టర్‌తో చర్చించి రెవెన్యూ అధికారులకు భద్రత కల్పిస్తామన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు