మాల్దీవుల్లో భారత బలగాల ఉపసంహరణపై ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని భారత బలగాలు మే 10 నాటికి ఉపసంహరణ పూర్తవుతుందని ఆ దేశ పార్లమెంటులో ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరవాత పార్లమెంటులో మొదటిసారి ప్రసంగిస్తూ ముయిజ్జు కీలక ప్రకటన చేశారు. మా సార్వహౌమత్వం విషయంలో ఏ దేశం జోక్యాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
మాల్దీవుల్లోని మూడు వైమానిక స్థావరాల్లో 80 మంది భారత సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 10లోగా ఒక స్థావరంలోని సైనికులు, మే 10 నాటికి మిగిలిన రెండు స్థావరాల్లోని సైనికులు వైదొగుతారని ముయిజ్జు ప్రకటించారు. సైనికులు కొనసాగేలా భారత్తో ఒప్పందాన్ని కొనసాగించేది లేదని ముయిజ్జు వెల్లడించారు.
మాల్దీవుల్లో భారత సైన్యం రాడార్ స్టేషన్లు, నిఘా, విమానాల నిర్వహణ చూస్తున్నాయి. మాల్దీవుల సరిహద్దుల్లో యుద్ధ నౌకల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నాయి. లక్షదీవులకు మాల్దీవులు సమీపంలో ఉన్నాయి. కీలక సముద్ర మార్గం కావడంతో భారత్ సాయం అందిస్తోంది. మాల్దీవుల్లో చైనా ప్రమేయం పెరిగిపోవడం భారత రక్షణ విషయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు