AP Assembly Budget Session kicked off from today
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు
నేటినుంచి ప్రారంభమయ్యాయి. మొదట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయసభల సభ్యులను
ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగంతో సభా కార్యక్రమాలు మొదలవుతాయి.
గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభా వ్యవహారాల కమిటీ
భేటీ జరుగుతుంది. ప్రస్తుత సభ ఎన్నాళ్ళు జరగాలన్న విషయాన్ని ఆ సమావేశంలో
నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బుధవారం 7వ తేదీన 2024-25
ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నందున,
మొదటి త్రైమాసికానికి మాత్రమే ఓటాన్ అకౌంట్‌కు శాసనసభ ఆమోదం తెలుపుతుంది.
అంతకుముందు, 7వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశమై, బడ్జెట్‌కు
ఆమోదముద్ర వేస్తుంది.
ఈ ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో శాసనసభా
సమావేశాలు ప్రారంభమయ్యాయి. కనీసం ఐదు రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరిగే
అవకాశముందని తెలుస్తోంది.