అంతరిక్షరంగంలో మరో రికార్డు నమోదైంది. రష్యాకు చెందిన వ్యోమగామి ఒలెగ్ కొనొనెంకో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి ఇప్పటిదాకా కొనొనెంకో ఐదుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. మొత్తం 878 రోజుల 12 గంటలపాటు అంతరిక్షంలో గడిపాడు. రష్యా అంతరిక్ష పరిశోధానా సంస్థ రాస్‌కాస్మోస్ ఈ విషయం వెల్లడించింది.
ఇప్పటికీ ఐఎన్‌ఎస్‌లోనే ఉన్న ఒలెగ్, మరికొన్ని రోజులు అక్కడే పరిశోధనలు చేయనున్నారు. సుమారు 1000 రోజులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండే అవకాశముందని రాస్‌కాస్మోస్ ప్రకటించింది. గతంలో రష్యాకే చెందిన గెన్నడీ పదల్కా 878 రోజుల 11 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆ రికార్డును కొనొనెంకో బద్దలు కొట్టారు.