విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆటలో
శుభమన్ గిల్ సెంచరీతో రాణించాడు. రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్ లో 78.3 ఓవర్లు ఆడి
255
పరుగులకు
ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 398 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
వన్ డౌన్ బ్యాట్స్ మన్ శుభ్
మాన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకోగా, శ్రేయాస్ అయ్యర్( 29), అక్షర పటేల్( 45), రవిచంద్రన్ అశ్విన్( 29)
రాణించారు.
యశస్వి జైస్వాల్(17), కెప్టెన్ రోహిత్ శర్మ(13) రజత్ పాటిదార్ (9), కేఎస్ భరత్ (6) నిరుత్సాహపరిచారు.
కుల్దీప్
యాదవ్ సున్నా పరుగుల వద్ద వెనుదిరగగా, బుమ్రా 26 బంతులాడినా
పరుగులు ఏమీ చేయలేదు. అశ్విన్‌తో కలిసి 9 వికెట్‌కు
స్కోర్ బోర్డుకు 26 పరుగులు జోడించారు. అశ్విన్ తర్వాత వచ్చిన
ముగ్గురు ఆటగాళ్లు సున్నా పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. కుల్దీప్, బుమ్రాలను హార్టీ లీ ఔట్ చేయగా, భరత్ వికెట్ ను అహ్మద్ తీశాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు
టామ్ హార్ట్ లీ నాలుగు వికెట్లు తీయగా , రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. అండర్సన్ 2, షోయబ్ బషీర్ ఒక వికెట్ తీశారు.
భారత్ నిర్దేశించిన 399 పరుగుల
లక్ష్యాన్ని ఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే, డకెట్ ప్రారంభించారు. ఇద్దరు కలిసి 8 ఓవర్లకు 39 పరుగులు చేశారు. 8వ ఓవర్ ముగిసే సమయానికి చెరి 19
పరుగులు సాధించారు. 50 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది.
అశ్విన్ వేసిన 10.5 బంతిని ఆడిన
బెన్ డకెట్(28) , కేఎస్ భరత్ కు క్యాచ్ ఇచ్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి
ఇంగ్లండ్ 14 ఓవర్లు ఆడి ఒక వికెట్
నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(29), రెహాన్(9) ఉన్నారు.