కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఆమె వ్యాఖ్యలు చేసిందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తాను మూడు రోజులు ఉపవాసం ఉంటున్నట్లు గతంలో సురన్యా ప్రకటించారు. అప్పట్లో ఈ పోస్ట్ దుమారం రేపింది. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేత అజయ్ అగర్వాల్ ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు.
తమ కాలనీలో ఇల్లు ఖాళీ చేయాలంటూ ఢిల్లీలోని జాంగ్పుర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సురన్యాను కోరింది. ఆమె వ్యాఖ్యల వల్ల తమ కాలనీలో ప్రశాంతత లేకుండా పోయే ప్రమాద ముందని కాలనీ వెల్ఫేర్ సంఘం అభిప్రాయపడింది. అయితే తన వ్యాఖ్యలకు కాలనీ సంక్షేమ సంఘానికి సంబంధం లేదని సురన్యా చెప్పుకొచ్చారు.