ఆమ్
ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు
భారతీయ జనతా పార్టీ(BJP) యత్నిస్తోందన్న కేజ్రీవాల్ ఆరోపణలపై
దిల్లీ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి,
ఆప్ అధినేత కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు. ఆరోపణలకు సంబంధించి మూడు
రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం
బీజేపీ నేతలు ఎవరితో మాట్లాడారో కూడా వివరించాలని కోరారు. నోటీసును ముఖ్యమంత్రి
కార్యాలయంలోని అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.
నోటీసు
జారీ సందర్భంగా కేజ్రీవాల్ నివాసంలో ఐదు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఏ
చట్టం ప్రకారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వ్యక్తిగతంగా తాఖీదులు జారీ చేస్తున్నారని
ఆప్ నేత,లు క్రైమ్ బ్రాంచ్ అధికారులను ప్రశ్నించారు.
దిల్లీ
లిక్కర్ పాలసీ లో భాగంగా నగదు అక్రమ చలామణి వ్యవహారానికి సంబంధించి విచారణలో
భాగంగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఈడీ, దిల్లీ
న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ ఈ నెల ఏడుకు వాయిదా పడింది.