వైజాగ్
వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శుభమన్ గిల్ సెంచరీ
చేశాడు. 132 బంతుల్లో 101 పరుగులు చేసి
సెంచరీ మార్క్ ను దాటాడు. గిల్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
టెస్టుల్లో మూడో
సెంచరినీ తన ఖాతాలో వేసుకుని ఆ తర్వాత
షోయబ్ బషీర్ వేసిన 55.6 బంతికి పెవిలియన్ చేరాడు. గత ఏడాది ఆస్ట్రేలియాపై గిల్
సెంచరీ చేశాడు.
ఆ
తర్వాత 12 ఇన్నింగ్సుల్లో అంతగా రాణించలేకపోయిన
గిల్, ఈ సారి మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.
35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన
దశలో జాగ్రత్తగా ఆడాడు. రెండుసాలు ఎల్బీ ముప్పును తప్పించుకుని మూడో వికెట్ కు
అయ్యర్ తో 81 పరుగులు జోడించారు. 111 పరుగుల వద్ద అయ్యర్ , క్యాచ్ ఔట్ గా పెవిలియన్
చేరాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(9) కూడా కీపర్ చేతికి చిక్కి వెనుదిరిగాడు.
గిల్ మాత్రం ఓర్పుతో ఆడి శతకం కొట్టాడు.
సెంచరీ
తర్వాత గిల్ కూడా ఔట్ కావడంతో భారత్, 211 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
దీంతో క్రీజులోకి శ్రీకర్ భరత్ వచ్చాడు. హార్ట్ లీ వేసిన 59.6 బంతికి అక్షర
పటేల్(45) ఔట్ అయ్యాడు. 60 ఓవర్లకు భారత్, ఆరు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.
తొలి
ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 243 పరుగులు చేయగా, భారత్ 396 పరుగులు చేసింది.