అల్ప
సంఖ్యాక ప్రజలకు మేలు చేయడమే భారతీయ జనతాపార్టీ ఉద్దేశమని ఆ పార్టీ నేషనల్ మీడియా
కో కన్వీనర్
జశ్వంత్
జైన్ అన్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర
స్థాయి వర్క్‌షాప్ లో పాల్గొన్న జశ్వంత్ జైన్, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బీజేపీ పై జరిగే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ
కార్యకర్తలు నిజమైన దేశభక్తులన్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కొన్ని శక్తులు
ప్రయత్నిస్తున్నాయని, కార్యకర్తలంతా
అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం చేస్తోన్న
కృషిని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలన్నారు. కరోనా వంటి విపత్కర
పరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వం పేదలకు అండగా ఉందని, ఆ విషయాన్ని అన్ని వర్గాలకు
వివరించాలన్నారు.
కేంద్రప్రభుత్వం
అమలు చేస్తోన్న పథకాలను మైనారిటీ నేతలంతా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించడంలో
ముందుండాలన్నారు.
భారతీయుల
మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న సంస్థల పట్ల జాతీయవాద మైనారిటీలు జాగ్రత్తగా
ఉండాలని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. తప్పుడు
సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల్లో విషాన్ని నింపుతున్న సంస్థల పట్ల జాగురూకతతో
వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి తగిన జవాబు ఇవ్వాలన్నారు.
పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థల మూలాలు పూర్తిగా
పెకిలించివేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, మైనారిటీ
మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ షేక్ రఫీ పాల్గొన్నారు.