నమీబియాలో
విషాదం, కేన్సర్ తో దేశాధ్యక్షుడు మృతి
నమీబియా
అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) కన్నుమూశారు. తాను కేన్సర్ తో బాధపడుతున్నట్లు నెలరోజుల
కిందటే హేజ్ ప్రకటించారు.
నేటి తెల్లవారుజామున గెంగోబ్ విండ్హోక్లోని లేడీ పోహంబా
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన పక్కన
భార్యాబిడ్డలు ఉన్నారని తాత్కాలిక అధ్యక్షుడు నాంగోలో ముబుంబా తెలిపారు.
‘‘
నమీబియా మంచి సేవకుడిని కోల్పోయింది.
రాజ్యాంగ రూపకర్త, విముక్తి పోరాట రోల్ మోడల్, ఓ గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయింది’’
అని సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.
విషాద సమయంలో ప్రజలంతా ప్రశాంతంగా, ఐక్యంగా ఉండాలని కోరిన తాత్కాలిక
అధ్యక్షుడు, ప్రభుత్వం తీసుకునే ప్రొటోకాల్
చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామన్నారు.
1990
లో దక్షిణాఫ్రికా నుంచి స్వాతంత్ర్యం పొందిన నమీబియాలో నవంబర్ లో అధ్యక్ష,
పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
ఇటీవల
నిర్వహించిన వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు కేన్సర్ సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స
కోసం అమెరికాకు వెళతానని హేజ్ పేర్కొన్నట్లు అధ్యక్ష కార్యాలయ అధికారులు
పేర్కొన్నారు.