జాతీయ దర్యాప్తు సంస్థ ఆయుధాల అక్రమ తరలింపు ముఠాను అరెస్ట్ చేసింది. సరిహద్దుల గుండా గుట్టుచప్పుడు కాకుండా మందుగుండు, పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబరులో నమోదు చేసిన కేసు దర్యాప్తు చేస్తుండగా కీలక ఆధారాలు లభించాయి. ఆయుధాల అక్రమరవాణాలో ఆరితేరిన కీలక సభ్యుడిని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (nia)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేస్తోన్న ముఠాను ఎన్ఐఏ శనివారం అదుపులోకి తీసుకుంది. మిజోరంకు చెందిన లలంగ్ గైహ్వామాను అయిజోల్‌లో అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్ తిరుగుబాటుదారులతో (crime news) ఇతనికి సంబంధాలున్నాయని ప్రాధమిక విచారణలో తేలిందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.