విశాఖ
వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్
ఆధిక్యం సాధించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను
కకావికలం చేశాడు.
ఓలీ
పోప్, రూట్ , బెయిర్ స్టో, స్టోక్స్ , హార్ట్ లీ, అండర్సన్ వికెట్లను బుమ్రా తన ఖాతాలో
వేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ మూడు
వికెట్లు తీయగా, అక్షర పటేల్ ఓ వికెట్ తీశాడు.
తొలి
ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్, 55.5 ఓవర్లు ఆడి 253 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 143
పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇంగ్లండ్ ఆటగాళ్ళు జాక్ క్రాలే 76, బెన్
స్టోక్స్ 47 పరుగులు చేయగా మిగతా వారు రాణించలేకపోయారు.
టీ
విరామ సమయానికి ముందు ఇంగ్లండ్ 33 ఓవర్లలో 155 పరుగులు చేసింది. బ్రేక్ తర్వాత
22.5 ఓవర్లకు పెవిలియన్ చేరింది.
ఇంగ్లండ్
59 పరుగుల వద్ద మొదటి వికెట్ నష్టపోయింది. బెన్ డకెట్(21), కుల్దీప్ బౌలింగ్ లో
క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. రెండో వికెట్ గా జాక్ క్రాలీ పెవిలియన్ చేరాడు. 78
బంతుల్లో 76 పరుగుల చేసిన జాక్ క్రాలీ,
క్యాచ్ ఔట్ అయ్యాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టపోయి 118 పరుగులు
చేసింది.
జో రూట్(5) కూడా నిరాశపరిచాడు. 134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు, ఆ తర్వాత స్కోర్ బోర్డు 143 కు
చేరుకోగానే ఓలీ పోప్ వికెట్ ను కోల్పోయింది.
టీ
విరామం తర్వాత జానీ బెయిర్ స్టో(25) ఔట్ అయ్యాడు.
కుల్దీప్
వేసిన 38.2 బంతికి ఫోక్స్(6) బౌల్డ్ అవ్వడంతో
ఇంగ్లండ్ స్కోరు బోర్డు నెమ్మదించింది.
తర్వాత వికెట్ కూడా కుల్దీప్ యాదవ్ కే
దక్కింది. రెహ్మాన్ అహ్మద్(6)ను పెవిలియన్‌కు సాగనంపాడు. బుమ్రా వేసిన 49.2 బంతికి
బెన్ స్టోక్స్(47) బౌల్డ్ అయ్యాడు. తొమ్మిదో వికెట్ కూడా బుమ్రాకే చిక్కింది. 51.2
బంతికి టామ్ హార్లీ ఔట్ అయ్యాడు. బుమ్రా వేసిన 55.5 బంతికి అండర్సన్(6) ఎల్బీడబ్ల్యూగా
వెనుదిరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగుల వద్ద ముగిసింది.
భారత్
రెండో ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రారంభించారు. ఇద్దరు కలిసి 5 ఓవర్లకు
28 పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే
సరికి ఇంగ్లండ్ పై భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.