పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ (punjab governer resignation) తన పదవికి రాజీమానా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన బన్వరీలాల్ శనివారం రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.
కొంతకాలంగా గవర్నర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ ప్రశ్నిస్తూ వచ్చారు. సీఎంకు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం పంపిన బిల్లులు సీఎం కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారంటూ సీఎం మాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు నిప్పుతో ఆడుకుంటున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.