Lal Krishna Advani, the champion of Rath Yatra, Game changer of Nationalism
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీని
భారతరత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అన్నివిధాలా
అర్హుడైన నాయకుడు ఉక్కుమనిషి లాల్‌కృష్ణ ఆఢ్వాణీ.
ఆఢ్వాణీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా 1986
నుంచి 1990 వరకూ, 1993 నుంచి 1998 వరకూ, చివరిగా 2004 నుంచి 2005 వరకూ పనిచేసారు. సుమారు
మూడు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆఢ్వాణీ, వాజ్‌పేయీ
మంత్రివర్గంలో హోంమంత్రిగా, ఉపప్రధానమంత్రిగా సేవలందించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం ప్రారంభించి,
రథయాత్రతో దేశమంతా చైతన్యం కలిగించిన నాయకుడు ఆఢ్వాణీ. ఆయన తనను తాను ‘రథయాత్రికుడి’గా
అభివర్ణించుకున్నారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఆఢ్వాణీ
రథయాత్ర ప్రారంభమైంది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత వరకూ
ఆ యాత్ర కొనసాగింది. దేశప్రజలలో జాతీయవాదాన్ని వ్యాపింపజేయడంలో ఆఢ్వాణీ చేసిన కృషి
అనన్యసామాన్యమైనది.
ఆఢ్వాణీ ధీశాలి, నైతిక విలువలకు కట్టుబడినవారు.
సుదృఢమూ సుసమృద్ధమూ అయిన భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకుడు.
ఆఢ్వాణీ 1927 నవంబర్ 8న అవిభక్త భారతదేశంలోని
సింధ్ ప్రాంతంలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో
చదువుకున్నారు. బాల్యం నుంచే ఆయనకు దేశభక్తి భావాలు మెండుగా ఉండేవి. అందుకే 14ఏళ్ళ
పిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు.
1980ల ద్వితీయార్థం నుంచీ ఆయన ఒకే లక్ష్యం కోసం
పనిచేసారు. జాతీయవాద భావాలతో ప్రజల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీని ప్రబల జాతీయ
రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే ఆ లక్ష్యం. 1984లో పార్లమెంటులో కేవలం 2 స్థానాలు
మాత్రమే ఉన్న బీజేపీ ఎదుగుదల ఆఢ్వాణీ పుణ్యమే. ఆయన కృషి ఫలితంగానే 1989 ఎన్నికల్లో
ఆ పార్టీ 86 సీట్లు గెలుచుకుంది. 1992లో పార్టీ 121 స్థానాలకు ఎదిగింది.
1996లో బీజేపీ 161 స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్ర
భారత చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యానికి అప్పుడే గండి పడింది. ఆ
పార్టీ గద్దె దిగింది. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ క్రమంలో
ఆ పార్టీకి అన్నీ తానే అయి నడిపించిన మహానేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీ. ఆయన స్థానాన్ని
ఇతరులెవ్వరూ అందుకోలేరు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు