నటి, మోడల్ పూనమ్ పాండే, గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు నిన్న మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె పీఆర్ టీమ్
నే మరణ వార్త ప్రకటన చేసింది. అయితే ఈ వార్తపై అప్పుడు పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. పూనమ్ ను
నమ్మలేమని ప్రచారం కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం
చేశారు. వారి అనుమానాన్ని నిజం చేస్తూ పూనమ్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు.
సర్వైకల్
కేన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనమ్ పాండే చెప్పారు. తాను బతికే ఉన్నానని
తెలిపారు. గర్భాశయ కేన్సర్ కారణంగా ఎంతో
మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని… అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే
ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ
వార్తతో బాధపడిన, ఇబ్బంది
పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. తాను చనిపోలేదని, గర్భాశయ కేన్సర్
పై అవగాహన కల్పించేందుకే ఆ ప్రకటనను తానే చేయించానని చెబుతోంది.
ఆమె
స్వయంగా వివరణ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గర్భాశయ
కేన్సర్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడం సాధ్యమేనని తెలిపిన పూనమ్,
కేన్సర్ చికిత్సపై అవగాహన కల్పించేందుకే చావు నాటకమాడినట్లు వీడియో మెసేజ్ ద్వారా
తెలిపింది.
పూనమ్
ప్రచార పిచ్చిని కొందరు తిట్టుకుంటుంటే మరికొందరేమో అందుకు చావు నాటకమాడాల్సిన అవసరం
లేదని చురకలంటిస్తున్నారు.