Bharat Ratna for Lal Krishna Advani
భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఈ
యేడాది బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీకి ప్రకటించారు. ఆ విషయాన్ని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.
‘‘శ్రీ లాల్‌కృష్ణ ఆఢ్వాణీకి భారతరత్న పురస్కారం
ప్రదానం చేస్తారన్న సంగతిని పంచుకోడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయనతో
మాట్లాడాను. భారతరత్న పురస్కారానికి ఎంపికైనందుకు అభినందించాను’’ అని ప్రధాని మోదీ
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేసారు.
‘‘ఆఢ్వాణీజీ మన కాలంలోని అత్యంత గౌరవప్రదులైన
రాజనీతిజ్ఞులు. దేశాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. క్షేత్రస్థాయి
నుంచి పనిచేయడం మొదలుపెట్టి ఉపప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన జీవితం ఆయనది.
హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆయన సేవలు గొప్పవి. పార్లమెంటులో ఆయన
ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి’’ అని మోదీ తన రాజకీయ గురువు ఆఢ్వాణీని కొనియాడారు.
‘‘ప్రజాజీవితంలో ఆఢ్వాణీ దశాబ్దాల తరబడి నిశ్చలమైన
నిబద్ధతతో, పారదర్శకతతో సేవలందించారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ఆయన నిలువెత్తు
నిదర్శనంగా నిలిచారు. జాతీయ సమైక్యతను, సాంస్కృతిక పునరుజ్జీవాన్నీ సాధించేందుకు
అనితర కృషి చేసారు. ఆయనకు భారతరత్న ప్రకటించడం నన్ను గొప్ప భావోద్వేగానికి
లోనుచేస్తోంది. ఆయనతో కలిసి పనిచేసి, నేర్చుకోడానికి లెక్కలేనన్నిసార్లు అవకాశాలు
దొరకడం నా భాగ్యంగా భావిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్ చేసారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు