ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌పై మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఉర్సు ఉత్సవాల సమయంలో ఉచితంగా తాజ్‌మహల్‌లోకి ప్రవేశాన్ని శాశ్వతంగా నిలిపివేయాలంటూ హిందూ సంఘం ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
1653లో తాజ్‌మహల్‌ను యమునా నది ఒడ్డున మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణానికి గుర్తుగా నిర్మించాడు. తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలు జరుపుకునే సమయంలో ఉచితంగా అనుమతించడాన్ని శాశ్వతంగా నిషేధించాలని ఏబీహెచ్ఎం డివిజనల్ హెడ్ మీనా దివాకర్, ఆగ్రా జిల్లా అధ్యక్షుడు సౌరభ్ శర్మ ఆగ్రా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.
తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలపై శాశ్వత నిషేధం విధించాలని పిటిషన్లో కోరారు. తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలకు ఉచిత ప్రవేశం కల్పించడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.