దేశవ్యాప్తంగా
మార్కెట్లో బియ్యం ధరలను పెరుగుదల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకుంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించేలా
‘భారత్
రైస్’ పేరుతో కిలో బియ్యాన్నిరూ.29 కే విక్రయించాలని నిర్ణయించింది. వచ్చే వారం నుంచి విక్రయాలు
ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
బియ్యం
ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ 15 శాతం మేర ధరలు పెరగడంతో ఈ చర్యలు చేపట్టినట్లు
వివరించారు.
భారత జాతీయ
వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార
వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ కేంద్రాల్లో అమ్మకాలు
చేపడతామని పేర్కొన్నారు.
ఈ-కామర్స్
వేదికగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు.
5 కేజీలు, 10 కేజీల
బ్యాగుల్లో ‘భారత్ రైస్’ విక్రయం జరగనుంది.
రిటైల్
మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం
ఏర్పాట్లు చేసింది.
బియ్యం
ధరలు అదుపులోకి వచ్చేంత వరకు ఎగుమతులపై నిషేధం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
చిల్లర
వ్యాపారులు, టోకు వర్తకులు, ప్రాసెసర్లు ప్రతి
శుక్రవారం బియ్యం నిల్వల వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరచాలని
ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే నిల్వలపై పరిమితి విధించే అంశాన్ని కూడా
పరిశీలిస్తామని చోప్రా తెలిపారు.