సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు ఈ నౌకను రూపొందించారు. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్ ఐఎన్ఎస్ సంధాయక్‌ను నిర్మించింది. 2019లో పనులు మొదలుపెట్టి ఇటీవల పూర్తి చేశారు. 3800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుతో నిర్మించారు.
సంధాయక్పై హెలిఫాడ్ ఏర్పాటు చేశారు. సర్వే పరికరాలు, రెండు పెద్ద డీజిల్ యంత్రాలు అమర్చారు. ఈ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ పనిచేయనున్నారు.విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో సంధాయక్‌ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు.