విశాఖ
వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్
సెంచరీ చేశాడు. 277 బంతుల్లో 200 పరుగులు సాధించాడు. 290 బంతుల్లో 209 పరుగులు చేసి అండర్సన్
బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు.
నిన్న
తొలి రోజు ఆటలో భాగంగా 93 ఓవర్లు ఆడిన రోహిత్ సేన ఆరు వికెట్లు నష్టపోయి 336
పరుగులు చేసింది. రెండో రోజు ఆటను యశస్వీ జైస్వాల్, అశ్విన్ ప్రారంభించారు. 96
ఓవర్లు ముగిసే సరికి భారత్ 344 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్లో
అశ్విన్ ఔట్ అయ్యాడు. దీంతో 364 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ నష్టపోయింది.
బషిర్
బౌలింగ్ లో ఫోర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది జైస్వాల్కు తొలి డబుల్
సెంచరీ. సొంతగడ్డపై 200 పరుగుల చేసి
రికార్డు సృష్టించాడు. గతంలో సౌరభ్ గంగూలీ(229), వినోద్ కాంబ్లీ(227), గౌతం
గంభీర్(206) ఈ ఫీట్ సాధించారు.
22 ఏళ్ళకే యశస్వీ ఈ ఫీట్ సాధించాడు. వినోద్ కాంబ్లీ 21 ఏళ్ళ 35
రోజుల వయస్సులో డబుల్ సెంచరీ సాధించాడు. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పై ద్విశతకం కొట్టగా, అప్పుడు అతని వయస్సు 21 ఏళ్ళ
283 రోజులు.