ఆరేళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెల 5వ తేదీన డీఎస్సీ, టెట్ పరీక్షలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల (dsc notification) చేయనుంది. 6100 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 12 ఏళ్ల కిందట తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మరలా తీసుకురానున్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనంతో పనిచేయాల్సి ఉంటుంది.
అప్రెంటిస్‌షిప్ సమయంలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మరలా పెంచే అవకాశముంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.ఈ పరీక్షలకు టీసీఎస్ సహకారం తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఏపీలో 50 వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని, కేవలం 6100 మాత్రమే భర్తీ చేయనుండటంపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు.