దక్షిణాఫ్రికా వేదికగా
జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ సెమీస్ కు చేరుకుంది. బ్లూంఫోంటీన్
లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకుంది. 132 పరుగుల
తేడాతో నేపాల్ ను ఓడించి సెమీస్ లో స్థానం ఖరారు చేసుకుంది. మరో రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆరోసారి విశ్వవిశేతగా యువ భారత్ జట్టు నిలుస్తుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యువ భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 297 పరుగులు చేసింది. సచిన్ దాస్ (116), కెప్టెన్ ఉదయ్ సహారన్ (100)
చెలరేగారు.
298 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ పేలవ ప్రదర్శనతో ఘోరంగా
విఫలమైంది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితమైంది.
నేపాల్ కెప్టెన్ దేవ్ ఖనాల్ చేసిన 33 పరుగులే ఆ జట్టు ఇన్నింగ్స్ లో
అత్యధికం. చివర్లో దుర్గేశ్ గుప్తా (29 నాటౌట్), ఆకాశ్ చంద్ (19) పోరాటంతో ఆలౌట్ కాకుండా
తప్పించుకోగల్గింది.
భారత
బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లు
తీయగా, అర్షిన్ కులకర్ణి రెండు, రాజ్ లింబాని , ఆరాధ్య శుక్లా , మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.