ఎర్రసముద్రంలో హౌతీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సిద్దమైంది. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల (houti rebels attacks) దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే సైన్యం రంగంలోకి దిగింది. ఇరాక్, ఇరాన్, సిరియాలోని హౌతీలు, రివల్యూషనరీ గార్డుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులు తీవ్రతరం చేసింది.
శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అమెరికా సైన్యం 85 స్థావరాలపై దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి వైమానిక దాడులు జరిపారు. నా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు ఇరాక్, సిరియాల్లో తిరుగుబాటుదారుల శిబిరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేసుకున్నాయి. మా దాడులు మొదలయ్యాయి. ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులుంటాయని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. డ్రోన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలను బైడెన్ శుక్రవారంనాడు పరామర్శించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు