భారత్,
ఇంగ్లండ్ మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 93 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 336
పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (179*)అజేయంగా
నిలవగా అతడికి తోడుగా అశ్విన్(5*) క్రీజులో
ఉన్నాడు.
ఇంగ్లండ్
బౌలర్లలో రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. హార్ట్
లీ, అండర్సన్ చెరో వికెట్ తీశారు.
టాస్
గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలుత నిలకడగా ఆడింది. 17.3 బంతికి ఇంగ్లండ్ కు
తొలి వికెట్ దక్కింది. పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఓలీ పోప్ కు క్యాచ్
ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ కూడా 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద
అభిమానులను నిరాశపరిచాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 28.5 బంతికి బెన్ ఫోక్స్ క్యాచ్
ఇచ్చి ఔట్ అయ్యాడు. 89 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ నష్టపోయింది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా యశస్వీ జైస్వాల్
మెరుగైన షాట్లతో అలరించారు. శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పటిదార్(32) కూడా
వెనుదిరిగారు.
విశాఖ
వేదికగా టెస్టుల్లోఅరంగేట్రం చేసిన రజత్ పటీదార్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
రెహాన్ వేసిన బాల్ ను డిఫెన్స్ ఆడినా వికెట్లను తాకింది. 85 ఓవర్లకు నాలుగు
వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేశారు. దీంతో క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 51 బంతులు
ఆడిన అక్షర పటేల్ 27 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
కీపర్ శ్రీకర్ భరత్(17)
ఆరో వికెట్ గా పెవిలియన్ చేరగా అశ్విన్, యశస్వీ కలిసి మొదటి రోజు ఆట ముగించారు.
257
బంతులు ఆడిన జైస్వాల్, 179 పరుగులు
చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు.