భారత
దేశ వ్యాప్తంగా 2022లో కొత్తగా 14.1 లక్షల కేన్సర్ కేసులు నమోదు కావడంతో పాటు 9.1
లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ కేన్సర్ పేరిట ఈ
నివేదికను విడుదల చేసింది. రొమ్ము కేన్సర్
తో ఎక్కువ మంది బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొంది.
పెదాలు,
నోరు, ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు ఎక్కువగా పురుషుల్లో నిర్ధారణ అయ్యాయనివెల్లడించింది.
నోటి కేన్సర్ తో 15.6 శాత మంది బాధపడుతుండగా, శ్వాసకోస కేన్సర్ కారణంగా 8.5 శాతం
మంది ఇబ్బందిపడుతున్నారు, మహిళల్లో రొమ్ము, సర్వైకల్ కేన్సర్ కేసులు ఎక్కువగా
బయటపడుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేసే అంతర్జాతీయ
కేన్సర్ పరిశోధన సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. ప్రతీ ఐదుగురులో ఒకరు కేన్సర్ తో
బాధపడుతుండగా, 9 మంది పరుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు కేన్సర్ తో
మరణస్తున్నట్లు నివేదించింది.
ప్రపంచవ్యాప్తంగా
115 దేశాలకు చెందిన కేన్సర్ రిపోర్టను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేయగా, కేవలం 39
దేశాలు మాత్రమే కేన్సర్ చికిత్స గురించి ప్రజలకు వివరిస్తున్నాయని నివేదించింది.
2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి కేన్సర్ నిర్ధారణ కాగా, 97 లక్షల మంది ప్రాణాలు
కోల్పోయినట్లు నివేదికలో తెలిపింది.