భారత్ –ఇంగ్లండ్ జట్ల మధ్య
జరుగుతున్న రెండో టెస్టులో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అద్భుత శతకంతో స్కోర్
బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు పడుతున్నా వెరవకుండా ఇంగ్లండ్ బౌలర్లను
చితకకొట్టి టెస్టుల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్ 151 బంతుల్లో శతకం చేశాడు. సిక్స్ తో సెంచరీ పూర్తి చేయడం
తొలి సెషన్ లో హైలెట్ గా నిలిచింది.
టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు
మూడు వికెట్లు నస్టపోయి 225 పరుగులు చేసింది. 185 బంతులు ఆడిన యశస్వీ జైస్వాల్ 125
పరుగులతో అజేయంగా నిలవగా, రజిత్ పాటిదార్ 47 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా
ఉన్నాడు.
జైస్వాల్ స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
కెప్టెన్
రోహిత్ శర్మ 14 పరుగుల వద్ద వెనుతిరగగా, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్,
టామ్ హార్ట్ లే , షోయబ్ బషీర్ తలా ఒక వికెట్ తీశారు.