ఉత్తర్‌ప్రదేశ్‌లోని
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)కి
మైనారిటీ హోదా పునరుద్ధరణపై వాదనలు
ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఎనిమిది రోజులపాటు ప్రత్యర్థి
వర్గాల వాదనలు విన్న CJI జస్టిస్ డి.వై.చంద్రచూడ్
సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును రిజర్వు చేయాలని
నిర్ణయించింది.
జస్టిస్
సంజీవ్‌ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పార్ధీవాలా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనంలో
సభ్యులుగా ఉన్నారు.
AMUకు మైనారిటీ హోదా అంశం దశాబ్దాలుగా
చట్టపరమైన అవరోధాలను ఎదుర్కుంటుంది. దీంతో కేసు విచారణను ఏడుగురు న్యాయమూర్తుల
ధర్మాసనానికి కేటాయించారు. 2019 నుంచి ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.
AMU కేంద్రీయ
విశ్వవిద్యాలయం కనుక దానిని మైనారిటీ సంస్థగా పరిగణించలేమన్నారు.
1981లో పార్లమెంటు ఆమోదించిన సవరణ చట్టంతో
మైనారిటీ హోదా పొందింది. 2006లో అలహాబాద్ హైకోర్టు ఈ నిబంధనను
కొట్టివేసింది. దీంతో యూపీఏ సర్కారు అప్పీలుకు వెళ్లగా, యూనివర్సిటీ కూడా ప్రత్యేక
పిటిషను దాఖలు చేసింది.
యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును
ఉపసంహరించుకుంటామని 2016లో
సుప్రీంకోర్టుకు ఎన్డీయే సర్కార్ తెలిపింది. ప్రభుత్వ నిధులు పొందుతున్న ఏఎంయూ మైనారిటీ
సంస్థ కాదని చెబుతోంది.