Champai Soren sworn in as CM of Jharkhand
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్
నాయకుడు చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
సోరెన్‌తో పాటు, కాంగ్రెస్ నాయకుడు
ఆలంగీర్ ఆలం, ఆర్జేడీకి చెందిన సత్యానంద్ భోక్త కూడా చంపయ్ క్యాబినెట్‌లో
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసాక
పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బయల్దేరారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు తమ ఎమ్మెల్యేలను
కాపాడుకోడానికి జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీల ఇండీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81మంది సభ్యులున్నారు.
వారిలో జేఎంఎం ఎమ్మెల్యేలు 29 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17మంది ఉన్నారు.
ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీలకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు.
ప్రతిపక్ష బీజేపీకి 26 సీట్లు, ఏజేఎస్‌యూకు
3 సీట్లు, స్వతంత్రులు-ఇతరులకు 3 సీట్లు ఉన్నాయి. ఒక స్థానం ఖాళీగా ఉంది. 43
ఎమ్మెల్యేల మద్దతుతో ఇండీ కూటమికి బలపరీక్ష గెలవడం అంత కష్టమేమీ కాదు. శాసనసభలో
బలం నిరూపించుకోడానికి చంపయ్ సోరెన్‌కు పది రోజుల గడువు ఉంది.
చంపయ్ సోరెన్ ఇప్పటికి 7సార్లు ఎమ్మెల్యేగా
చేసారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేసారు.