Kejriwal is not appearing before ED, he did not respond to ED summons
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత,
అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరు
కానున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరు కాకూడదని
కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. తనకు ఈడీ నోటీసులు జారీ చేయడం అక్రమమని, చట్టవిరుద్దమని
ఆయన అభిప్రాయపడ్డారు.
లిక్కర్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ
కేజ్రీవాల్‌కు ఈడీ గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు సమన్లు జారీ
చేసింది. ఏ ఒక్కసారీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇవాళ శుక్రవారం
విచారణకు హాజరు కావాలని బుధవారం మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఈసారి కూడా ఈడీ
సమన్లకు స్పందించకూడదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. తనను
అన్యాయంగా అరెస్ట్ చేసేందుకే ఈడీ ఇన్నిసార్లు సమన్లు పంపిస్తోందంటూ ఆయన
ఆరోపించారు.
ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌కు
మొదటిసారి గత నవంబర్ 1న సమన్లు జారీ చేసింది.
తరువాత డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న నోటీసులు ఇచ్చింది. ఆ
నోటీసులు అన్నింటినీ కేజ్రీవాల్ బుట్టదాఖలు చేశారు.