మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా అరెస్టై జైళ్లో ఉన్న ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వేసిన పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. హైకోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చింది.
భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ గురువారం నాడు సోరెన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ముందుగా ఝార్ఖండ్ హైకోర్టులో పిటీషన్ వేశారు. గురువారం విచారణకు రావాల్సి ఉంది. సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పడంతో హైకోర్టులో కేసు ఉపసంహరించుకున్నారు.
కుట్రలో భాగంగా ఈడీ అధికారులను తనను అరెస్ట్ చేశారని పిటీషన్లో సోరెన్ పేర్కొన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి రాజ్‌భవన్‌కు వెళితే అక్కడ అరెస్టు చేశారంటూ హేమంత్ సోరెన్ కోర్టుకు సమర్పించిన పిటీషన్లో తెలిపారు.