కోట్లాది హిందువుల కలవేరడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు.అయోధ్యలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో బాలరాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన 11 రోజుల్లోనే బాలరాముడిని 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. సగటున ప్రతి రోజూ 2 లక్షల మందికిపైగా భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.
గత 11 రోజుల్లో బాలరాముడికి భక్తులు హుండీల ద్వారా రూ.11 కోట్ల విరాళాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శన సమయాలను కూడా పెంచారు.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. మరికొంత కాలం భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.