అగ్రరాజ్యం అమెరికా తీవ్ర హెచ్చరికలు చేస్తోన్నా హౌతీ తిరుగుబాటుదారులు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగారు. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది. లైబీరియా జెండాతో ప్రయాణం చేస్తోన్న నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని హూదేదా నుంచి క్షిపణులు ప్రయోగించారు. వాణిజ్య నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడగలిగారు. రెండు క్షిపణులు నౌక సమీపంలో పేలడంతో పెను ప్రమాదం తప్పిందని అమెరికా ప్రకటించింది.
తిరుగుబాటుదారులను ఎలా అణచివేయాలో తమకు తెలుసంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించిన మరుసటిరోజే హౌతీలు దాడులకు తెగబడ్డారు. హౌతీలకు ఇరాన్ సాయం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. యెమెన్ కేంద్రంగా హౌతీలు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు