second BHARATvENG
Test భారత్-ఇంగ్లండ్
మధ్య విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో
భాగంగా హైదరాబాద్ తొలి టెస్టులో భారత్ ఓడింది. నేడు వైజాగ్ వైఎస్సార్ క్రికెట్
స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మ్యాచ్
కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, వ్యక్తిగత
కారణాలతో దూరంగా ఉండగా, గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా విశ్రాంతి
తీసుకుంటున్నారు. పేసర్ మహ్మద్ సిరాజ్ కు
కూడా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.
ఈ
మ్యాచ్ ద్వారా రజిత్ పటీదార్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సర్ఫరాజ్
కు తుది జట్టులో చోటు దక్కలేదు.
యశస్వీ
జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆటను ప్రారంభించారు. తొలి ఓవర్ ను జేమ్స్
అండర్సన్ వేశాడు. తర్వాతి ఓవర్, జో రూట్ సంధించగా, మన ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు.
ఐదు ఓవర్లకు 14 పరుగులు మాత్రమే చేశారు. 12
ఓవర్లకు ఇద్దరు కలిసి 28 పరుగుల చేశారు.
భారత జట్టు.. యశస్వి జైస్వాల్, రోహిత్
శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్
పాటిదార్,
శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్
భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్
పటేల్,
జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్
కుమార్,
కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్
డకెట్,
ఆలీ పోప్, జో
రూట్,
జానీ బెయిర్‌స్టో, బెన్
స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్
అహ్మద్,
టామ్ హార్ట్లీ, షోయబ్
బషీర్,
జేమ్స్ అండర్సన్