దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ దూకుడుకు కారణంగా తెలుస్తోంది. ఉదయాన్నే సెన్సెక్స్ ఒకేసారి 843 పాయింట్లు పెరిగి 72488 పాయింట్ల రికార్డు స్థాయికి చేరింది. నిఫ్టీ 248 పాయింట్లు పెరిగి, 21946 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ 82.91 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిల్‌టెల్ షేర్లు భారీ లాభాలార్జించాయి. మారుతీ, ఎల్ అంట్ టీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలసివచ్చింది. ఇవాళ అనేక కంపెనీలు ఆశాజనకంగా త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయనే అంచనాలు కూడా పెట్టుబడిదారుల ఉత్సాహానికి కారణంగా తెలుస్తోంది.