అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారు. యూఎస్‌లోని ఒహాయోలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రేయాస్‌రెడ్డి మృతిపై కేసు (crime news) నమోదు చేసి,పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
శ్రేయాస్‌రెడ్డి సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థిగా గుర్తించారు. శ్రేయస్ మృతి వివరాలు అతని తల్లిదండ్రులకు అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత్ నుంచి అమెరికా చేరుకోవాల్సి ఉంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గత వారం వివేక్ సైనీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటన మరవక ముందే మరో విద్యార్థి చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.