దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడిదారులు ఆశించిన రాయితీలు ప్రకటించకపోవడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి (stock markets) గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రైల్వే, హౌసింగ్, మౌలిక సదుపాయాలు, ఏవియేషన్ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. బడ్జెట్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడంతో స్టాక్ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తప్పలేదు.
సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 71645 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి, 21697 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మారుతీ షేర్లు లాభాలు పొందాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, విప్రో, టెక్ మహింద్రా, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, జెఎస్బ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి.