శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల
నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు( కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు
తెలుగురాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. హైదరాబాద్‌లో నేడు జరిగిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్
బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్
(ఈఎన్సీ)లు పాల్గొన్నారు.
కేఆర్ఎంబీకి శ్రీశైలం,
నాగార్జున సాగర్
నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్
లో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్
అప్పగింతకు అంగీకరించినట్లు వివరించారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే
తుది నిర్ణయమన్నారు.
కృష్ణా
జలాల్లో 50 శాతం వాటా డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
రావు అన్నారు. అవుట్ లెట్స్ ను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం
తెలిపినట్టు వెల్లడించారు.