కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ను
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉపాధికి ఊతమివ్వడంతో పాటు వృద్ధి ఆధారిత
బడ్జెట్ అని వివరించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచేందుకు ఈ
బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమ్మిళిత,
సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మద్యంతర బడ్జెట్ అని కొనియాడిన ప్రధాని, దేశాభివృద్ధి
కొనసాగింపునకు విశ్వాసం కల్పించిందన్నారు. యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారితకు
ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. యువ భారత
ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు.
సాంకేతికత
రంగంలో పరిశోధనల కోసం లక్ష కోట్ల బడ్జెట్
కేటాయింపును ప్రస్తావించిన మోదీ, యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
పీఎం
ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్ళలో 2 కోట్ల ఇళ్ళ నిర్మాణం గురించి ప్రకటించామని,
మహిళలను లక్షాధికారుల్ని చేసే పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నామని
తెలిపారు.
సామాన్యులపై
భారం పడకుండా ఈ బడ్జెట్ ను రూపొందించారని ప్రశంసించారు. ఆయుష్మాన్ భారత్ పథకం
ద్వారా, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందుతారన్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల