విశాఖలోని
డాక్టర్ Ysr స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య
రేపు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే
ఓ మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్, 1-0తో ముందంజలో ఉంది.
విశాఖ
చేరుకున్న ఇరు జట్లు, ప్రాక్టీస్ మొదలు పెట్టాయి.
వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు
విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా
ఆటకు దూరమయ్యారు. దీంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ
జట్టులోకి తీసుకుంది.
విశాఖ
టెస్టుకు ఇంగ్లండ్ కూడా తుది జట్టును ప్రకటించింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు
అవకాశం కల్పించింది. జాక్ లీచ్ స్థానంలో అతడికి అవకాశం కల్పించింది. మార్క్‌వుడ్ స్థానంలో
పేసర్ జేమ్స్ అండర్సన్ ఆడనున్నారు. హైదరాబాద్ టెస్టులో మార్క్‌వుడ్ ఒక్క వికెట్
కూడా తీయలేదు. జాక్ లీచ్, మోకాలి గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో షోయబ్ బషీర్
ఆడనున్నాడు.
విశాఖ
టెస్టులో ఆడే ఇంగ్లండ్ జట్టు…
జాక్ క్రాలీ, టెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్ , జానీ
బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్
బషీర్, జేమ్స్ అండర్సన్