FM sets fiscal deficit target as 5.1%, no new taxes
2023 కేంద్ర బడ్జెట్ను లోక్సభలో
సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి
ద్రవ్యలోటును జీడీపీలో 5.1శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు
చెప్పారు.
2023-24లో ప్రభుత్వం ద్రవ్యలోటును
జీడీపీలో 5.9శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం నిర్ణయించుకుంది. దాన్ని తర్వాత
5.8శాతానికి సవరించారు.
మొత్తంగా చూసుకుంటే 2025-26 నాటికి ద్రవ్యలోటును
జీడీపీలో 4.5శాతం కంటె తక్కువకు చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఆర్థిక
మంత్రి వెల్లడించారు.
దేశ ప్రజలకు ఊరట కలిగించే విషయం ఏంటంటే
కేంద్రప్రభుత్వం ప్రజల మీద కొత్తపన్నులు విధించలేదు, ఇప్పటికే ఉన్న పన్నుల
భారాన్ని పెంచలేదు.
‘‘పన్ను ప్రతిపాదనల విషయానికి వస్తే,
సంప్రదాయంగా వస్తున్న విధానాన్ని అనుసరిస్తూ, ఉన్న పన్నుల విధానంలో ఎలాంటి
మార్పులూ ప్రతిపాదించలేదు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాలపై, ఇప్పటికి
అమల్లో ఉన్న పన్నురేట్లనే కొనసాగిస్తున్నాము’’ అని నిర్మల వివరించారు.
2024-25 ఆర్థిక
సంవత్సరంలో మూలధన వ్యయాన్ని 11.1శాతం అంటే రూ.11.11 లక్షల కోట్లకు పెంచాలని
ప్రభుత్వం ప్రతిపాదించింది.