మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అరెస్టుకు ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు. ఆలస్యంగా ఆ వీడియో గురువారంనాడు వెలుగులోకి వచ్చింది.
ఈడీ అరెస్టు చేసేలా ఉంది. నేనేమీ బాధపడటం లేదు. నేను శిబూసోరెన్ కుమారుడిని. రోజంతా ప్రశ్నించి సంబంధం లేని కేసులుపెట్టి, అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ అరెస్టుకు ముందు రికార్డు చేసిన వీడియో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోని తన నివాసంలో తనిఖీలు చేసి తన పరువు తీయాలని చూశారు. ఆదివాసీలు, అమాయకులు, దళితులపై అరాచకాలకు పాల్పడే వారిపై పోరాటం చేయాల్సిన అవసరముందని ఆ వీడియోలో సోరెన్ అభిప్రాయపడ్డారు.