Nirmala Sitaraman says people will bless BJP govt with great majority
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభ
ముందు మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం అనుసరించిన మంచి
విధానాలు, పనితీరును ప్రజలు ఆదరిస్తారని, బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి
వస్తుందనీ ధీమా వ్యక్తం చేసారు.
లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా
సీతారామన్ ‘‘మన యువదేశానికి ఉన్నతమైన ఆశలున్నాయి, వర్తమానం గురించి గర్వముంది,
ప్రకాశవంతమైన భవిష్యత్తు గురించి ధీమా, ఆశ ఉంది. మా ప్రభుత్వం అద్భుతమైన పనితీరు
కారణంగా ప్రజలు అద్భుతమైన మెజారిటీతో మమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తారని
భావిస్తున్నాం’’ అని ఆకాంక్షించారు.
గత పదేళ్ళలో 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి
బైటపడడానికి ప్రభుత్వం కృషి చేసిందని నిర్మల చెప్పారు. ‘‘రెండో దఫా పాలనలో మా
ప్రభుత్వం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా వికాస్’ అనే మా దృష్టిని మరింత
బలోపేతం చేసింది’’ అన్నారు.
పార్లమెంట్ సమావేశం
మొదలవడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గం 2024
మధ్యంతర బడ్జెట్ను ఆమోదించింది.