ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై యూఎస్ అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. సైనికుల మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం తమకు లేదని బైడెన్ తేల్చిచెప్పారు.
అమెరికా సైనికులపై దాడులు చేసింది ఏ ఉగ్ర సంస్థో స్పష్టంగా తెలియాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రతిదాడులకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు. దశల వారీగా దాడులు చేసే అవకాశముందన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన అమెరికా సైనికుల కుటుంబాలను బైడెన్ పరామర్శించారు.
ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనికుల శిబిరాలపై జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలయ్యాక ఆ ప్రాంతంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తమదేశంపై దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనిక శిబిరాలపై దాడులు చేసిన ఉగ్రసంస్థలకు ఇరాన్ సహకారం అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు