మానవ సంబంధాలు మంటకలసిపోతున్నాయి. ఓ మహిళపై బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో చోటు చేసుకుంది. భీమవరం రూరల్ గ్రామానికి చెందిన ఓ మహిళ బహిర్భూమికి వెళ్లగా 16 సంవత్సరాల బాలుడు అత్యాచారం (crime news) చేశాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన బాలుడు పాత నేరస్థుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసినట్లు గుర్తించినట్లు భీమవరం పోలీస్ స్టేషన్ రైటర్ మహేశ్వరరావు వెల్లడించారు.