ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెండు రోజుల
కిందట 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అయితే ఆ జీవోలో తాజాగా మార్పులు చేసింది.
ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల పోస్టుంగులు, బదిల్లీలో మార్పులు చేస్తూ మళ్ళీ
ఉత్తర్వులు జారీ చేసింది.
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా విధులు
నిర్వహిస్తోన్న శంఖబ్రత బాగ్చీకి హోంగార్డ్ ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా విధులు నిర్వహిస్తోన్న రాజశేఖర్ బాబుకు
కోస్టల్ సెక్యూరిటీ ఐజీ అదనపు బాధ్యతలు కేటాయించారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్
ఆర్డర్ డీసీపీ బాధ్యతలను కృష్ణకాంత్‌కు
అప్పగించారు. సీఐడీ ఎస్పీగా గంగాధర్‌రావును బాధ్యతలు చేపట్టనున్నారు.
కాకినాడ ఎస్పీ సతీశ్ కుమార్, కాకినాడ ఏపీఎస్పీ
బెటాలియన్ కమాండెంట్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరో బెటాలియన్(మంగళగిరి) కమాండెంట్ గా వి.రత్న, 14వ బెటాలియన్(అనంతపురం)
కమాండెంట్ గా అమిత్ బర్దార్ ను నియమించారు. ఐపీఎస్ అధికారి ఆనందరెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు.
తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ
కూడా ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం
ఆదేశాల మేరకు… ప్రస్తుతం జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4లోని తహసీల్దార్ల బదిలీలు జరుగుతున్నాయి.
జోన్-1లో 137 మంది, జోన్-2లో 170 మంది, జోన్-3లో 154 మంది, జోన్-4లో 249 మంది తహసీల్దార్లు ట్రాన్స్ఫర్
అయ్యారు. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.