Nirmala Sitaraman to introduce Interim Budget
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి.
గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వరసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆ
రికార్డును నిర్మల సమం చేసారు.
నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్
ప్రవేశపెడతారు. కొద్దిరోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్నందువల్ల పూర్తిస్థాయి
బడ్జెట్‌ను ఇప్పుడు ప్రవేశపెట్టరు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి
బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో పెద్దగా విధాన
మార్పులు ఉండే అవకాశం లేదు. అలాగే భారీ ప్రకటనలు వెలువడే ఛాన్స్ కూడా లేదు. అయితే వివిధ
వర్గాల నుంచి ప్రభుత్వంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను
శ్లాబులు మారుస్తారని వేతనజీవులు ఆశిస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రేటును
పెంచుతారనీ, 80సి, 80డి సెక్షన్ల కింద పన్ను మినహాయింపుల పరిమితిని పెంచుతారనీ
అంచనా వేస్తున్నారు.