బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోం
మంత్రి తనయుడు జై షా, అంతర్జాతీయ క్రికెట్ లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. బీసీసీఐ
కార్యదర్శిగా ఉంటూనే జై షా, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలుగా ఏసీసీ
అధ్యక్షుడిగా పనిచేసిన జై షా తాజాగా మూడోసారి ఆ పదవికి
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇండోనేషియాలోని బాలిలో నేడు జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య
సమావేశం లో ఎన్నిక జరిగింది. ఏసీసీ అధ్యక్షుడిగా జై షా పేరును శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు
షమ్మీ సిల్వా ప్రతిపాదించగా మిగతా సభ్య దేశాలు బపరిచాయి.
ఆసియా క్రికెట్ మండలి సభ్యదేశాలన్నీ తన
పట్ల మరోసారి నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు అంటూ జై షా స్పందించారు. ఆసియా
వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఏసీసీ కట్టుబడి ఉంటుందన్నారు.
2019
నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా, 2021లో ఏసీసీ
అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
నజ్ముల్ హుస్సేన్ ఈ బాధ్యతలు నిర్వహించారు.
ఆసియా దేశాల్లో క్రికెట్ అభివృద్ధిలో జై షా
కీలకంగా వ్యవహరించారు. క్రికెట్ లైవ్ ప్రసారాలు, వాణిజ్య ఒప్పందాల విషయంలో జై షా
చురుగ్గా వ్యవహరిస్తారాని అతడి ఎన్నిక ఆసియా క్రికెట్ కు ప్రయోజనకరంగా ఉంటుందని శ్రీలంక
క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సిల్వా చెప్పారు.