Gyanvapi Case: Huge victory for Hindu side, court allows for worship in sealed basement
వారణాసిలోని జ్ఞానవాపి
మసీదుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో ఇవాళ హిందూపక్షానికి భారీ విజయం
దక్కింది. కొన్నేళ్ళుగా మూసివేసి ఉన్న నేలమాళిగలో పూజలు చేసుకోడానికి వారణాసి న్యాయస్థానం
అనుమతించింది.
జ్ఞానవాపి మసీదు
నేలమాళిగలో ఉన్నదేవీదేవతల మూర్తులకు పూజలు చేసుకోడానికి వారణాసి న్యాయస్థానం
అనుమతి ఇచ్చింది. అక్కడ పూజలు చేసుకోడానికి తగిన ఏర్పాట్లు వారంలోగా పూర్తి చేయాలని
జిల్లా కలెక్టర్‌ని కోర్టు ఆదేశించింది. గతవారమే కోర్టు ఆదేశాల మేరకు జిల్లా
కలెక్టర్ నేలమాళిగ తాళాలను స్వాధీనం చేసుకున్నారు.
వారణాసి జిల్లా కోర్టు
ఇచ్చిన ఈ తీర్పును హిందూపక్షానికి చెందిన న్యాయమూర్తి, అయోధ్యలో రామమందిరం తాళాలు
తెరిపించిన సంఘటనతో సమానమైదిగా భావిస్తున్నారు. ఈ నేలమాళిగలో 1993 వరకూ క్రమం
తప్పకుండా పూజా పునస్కారాలు జరుగుతుండేవి. 1992 డిసెంబర్లో అయోధ్య వివాదం తర్వాత
వారణాసి అధికారులు జ్ఞానవాపికి నాలుగు వైపులా బ్యారికేడ్లు పెట్టి, దర్శనానికి
ఎవరినీ వెళ్ళనివ్వకుండా జిల్లా అధికార వర్గాలు పూజలు నిలిపివేసాయి. ఫలితంగా
నేలమాళిగలోకి వెళ్ళే దారి మూసుకుపోయారు.
సోమనాథ్ వ్యాస్ కుటుంబీకులు
1993 వరకూ నేలమాళిగలోని మూర్తులకు క్రమం తప్పకుండా ఉదయం, సాయంకాలం నిర్ణీత వేళల్లో
పూజలు చేసేవారు. అక్కడ మళ్ళీ పూజలు చేసుకోనివ్వాలంటూ వ్యాస్ కుటుంబానికి చెందిన
మనవరాలు శైలేంద్ర వ్యాస్ న్యాయస్థానంలో పిటిషన్ వేసారు. ఆమె తన పిటిషన్లో, 1993 వరకూ
జ్ఞానవాపి నేలమాళిగలోని దేవతామూర్తులకు పూజలు జరుగుతుండేవని, 1993 నుంచే పూజలు
నిలిచిపోయాయనీ వివరించారు.
ఇన్నాళ్ళూ ఆ నేలమాళిగ
అంజుమన్ ఇంతజామియా మస్జిద్ కమిటీ అధీనంలో ఉంది. ఆ ప్రదేశాన్ని కలెక్టర్
పర్యవేక్షణకు అప్పగిస్తూ 17 జనవరిన ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు 24 జనవరిన
కలెక్టర్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ వారం రోజుల్లోగా
పూజలు ప్రారంభించాలని, కాశీ విశ్వనాథ ఆలయం పూజారులు ఆ పని చేపట్టాలనీ కోర్టు
ఆదేశించింది.
మాళిగలో పూజలు
చేసుకోవాలన్న పిటిషన్‌కు వ్యతిరేకంగా ముస్లిముల తరఫున అంజుమన్ ఇంతజామియా కోర్టులో
వాదించింది. కోర్టు మొదట రిసీవర్‌ను నియమించాలని మాత్రమే చెప్పిందనీ, అక్కడ పూజలు
చేయడం గురించి ఏమీ చెప్పలేదనీ వాదించింది. ఇప్పుడు కోర్టు ఆ వాదనను పూర్వపక్షం
చేస్తూ పూజలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.