మెగా
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం
జగన్ అధ్యక్షతన జరిగిన 49వ మంత్రి మండలి సమావేశంలో 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలని
నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపిన జగన్ మంత్రివర్గం,
ఫిబ్రవరిలో నిధులు విడుదల చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలకు
రూ. 5 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
తెలిపింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన
మంత్రివర్గం, ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యాన్ని ఆమోదించింది.
రాష్ట్రంలోని
ప్రతీ గ్రామానికి ఓ పంచాయతీ సెక్రటరీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలు,
ఉన్నత విద్యాసంస్థలో పనిచేస్తోన్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ళ
నుంచి 62 ఏళ్ళకు పెంచారు.
నంద్యాల,
కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం
లభించింది.