దేశం
దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ
సారి ఆర్థికమంత్రి దిశను నిర్దేశించే బడ్జెట్ను పార్లమెంటులో
ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలిచి పూర్తిస్థాయి బడ్జెట్
ప్రవేశపెడతామని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు
మీడియాతో మాట్లాడిన ప్రధాని, ప్రజల ఆశీర్వాదంతోనే తమ ప్రయాణం కొనసాగుతుందన్నారు.
పార్లమెంటు
సజావుగా జరగకుండా అడ్డుకునే ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా
ప్రతిపక్షాలకు ప్రధాని చురకలు అంటించారు. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం
కలిగించే వారిని ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా
ప్రవర్తించేవారు ఇప్పటికైనా మారాలని సూచించారు.
శాంతి
పరిరక్షణలో మహిళల పాత్ర కీలకంగా మారిందన్న ప్రధాని మోదీ, మహిళా రిజర్వేషన్
బిల్లుకు ఆమోదం తెలిపిన చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రపతి ముర్ము మార్గదర్శకత్వంలో మొదలు కానుండటం, బడ్జెట్ను నిర్మలా సీతారామన్
ప్రవేశపెట్టనుండడం, భారత నారీశక్తికి నిదర్శనమన్నారు.